కమలా హారిస్‌ ఫొటోపై నాలుక్కరుచుకున్న ‘వోగ్‌’

ABN , First Publish Date - 2021-01-21T12:44:58+05:30 IST

అమెరికా నూతన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కవర్‌ ఫొటో విషయంలో ప్రముఖ ఆంగ్ల మ్యాగజిన్‌ ‘వోగ్‌’ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

కమలా హారిస్‌ ఫొటోపై నాలుక్కరుచుకున్న ‘వోగ్‌’

న్యూయార్క్‌, జనవరి 20: అమెరికా నూతన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కవర్‌ ఫొటో విషయంలో ప్రముఖ ఆంగ్ల మ్యాగజిన్‌ ‘వోగ్‌’ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. నలుపురంగు సూట్‌లో ఉన్న ఆమె ఫొటోతో కవర్‌ పేజీ బయటకు పొక్కింది. విమర్శలు రావడంతో వోగ్‌ నాలిక్కరుచుకొంది. తన డిజిటల్‌ ఎడిషన్‌కు డిజైన్‌ చేసిన కవర్‌ పేజీతో కొన్ని ప్రత్యేక సంచికలను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆ కవర్‌ పేజీలో కమలా హారిస్‌.. లేత నీలం రంగు సూట్‌ వేసుకుని కనిపిస్తారని పేర్కొంది. 

Updated Date - 2021-01-21T12:44:58+05:30 IST