30,000 మందికి వోక్స్‌వాగన్ ఉద్వాసన..?

ABN , First Publish Date - 2021-10-14T02:22:44+05:30 IST

ప్రముఖ వోక్స్‌వాగన్ కార్ల తయారీ సంస్థ 30,000 మంది ఉద్యోగులను తగ్గించే ఆలోచనలో ఉంది. ఖర్చులు తగ్గించుకోవడం..

30,000 మందికి వోక్స్‌వాగన్ ఉద్వాసన..?

న్యూఢిల్లీ: ప్రముఖ వోక్స్‌వాగన్ కార్ల తయారీ సంస్థ 30,000 మంది ఉద్యోగులను తగ్గించే ఆలోచనలో ఉంది. ఖర్చులు తగ్గించుకోవడం, 'తెస్లా' వంటి ఎలక్టిక్ వెహికల్ సంస్థకు గట్టి పోటీ ఇవ్వడం కోసం ఉద్యోగాల్లో కోత ఆలోచన చేస్తున్నట్టు జర్మన్ డెయిలీ బుధవారంనాడు ఒక కథనం ప్రచురించింది. ఈమేరకు సూపర్‌వైజరీ బోర్డుకు వోక్స్‌వాగన్ సీఈఓ హెర్బర్ట్ ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినట్టు తెలిపింది. దీనిపై వోక్స్‌వ్యాగన్ ప్రతినిధి ఆచితూచి స్పందించారు. మార్కెట్లో కొత్తగా వస్తున్న వారికి గట్టి పోటీ ఇచ్చే విషయంలో ఎలాంటి రాజీ లేదని, ఇందుకు సంబంధించి చాలా ఆలోచనలు ఉన్నప్పటికీ దానికి తుదిరూపు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. కాగా, హెర్బర్ట్  వ్యాఖ్యలకు సంబంధించి వస్తున్న ఊహాగానాలపై తాము ఎలాంటి కామెంట్ చేయలేమని, అయితే 30,000 ఉద్యోగాలు తగ్గించడం పూర్తిగా అసంబద్ధం, నిరాధారమని వోక్స్‌వాగన్ వర్కర్స్ కౌన్సిల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, ప్రస్తుతం ఉన్న బ్యాటరీ డివిజన్‌కు అదనంగా కార్ చార్జింగ్, ఎనర్జీ బిజినెస్‌ను లిస్టింగ్ చేసే విషయాన్ని వోక్స్‌వాగన్ పరిశీలిస్తున్నట్టు సంస్థ చీఫ్ టెక్నాలజీ అధికారి థామస్ తెలిపారు.

Updated Date - 2021-10-14T02:22:44+05:30 IST