పెన్షన్ అడిగినందుకు వృద్ధుడిపై వాలంటీర్ దాడి

ABN , First Publish Date - 2020-10-18T14:18:42+05:30 IST

సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను నెలకొల్పింది. అయితే వాలంటీర్‌లు అందుకు విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. పెన్షన్ అడిగినందుకు వృద్ధుడిపై వాలంటీర్ దాడి చేశాడు.

పెన్షన్ అడిగినందుకు వృద్ధుడిపై వాలంటీర్ దాడి

అనంతపురం: సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను నెలకొల్పింది. అయితే వాలంటీర్‌లు అందుకు విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. పెన్షన్ అడిగినందుకు వృద్ధుడిపై వాలంటీర్ దాడి చేశాడు. బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లిలో ఈ ఘటన జరిగింది. పెన్షన్ ఇప్పించాలంటూ వాలంటీర్‌ను వృద్ధుడు వెంకటరామిరెడ్డి అడిగాడు. అయితే ఇందుకు వాలంటీర్ ప్రతిఫలం ఆశించాడు. పెన్షన్ కోసం వాలంటీర్ లోకేశ్వరరెడ్డి  రూ.5 వేలు డిమాండ్ చేశాడు. గతంలో తన సోదరుడి ద్వారా వాలంటీర్‌కు వృద్ధుడు రూ.5 వేలు ఇచ్చాడు. నెలలు గడుస్తున్నా పెన్షన్ రాకపోవడంతో డబ్బులు వెనక్కివ్వాలని వాలంటీర్‌ను వెంకటరామిరెడ్డి అడగాడు. దీంతో వాలంటీర్ దాడి వృద్ధుడుపై దాడి చేశారు. వాలంటీర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. వాలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నాడు.

Updated Date - 2020-10-18T14:18:42+05:30 IST