Advertisement
Advertisement
Abn logo
Advertisement

రిలే నిరాహర దీక్షలు చేపట్టిన వలంటీర్లు


మాతృభాష వలంటీర్లను రెన్యువల్‌ చేయాలి

ఐటీడీఏ వద్ద రిలే నిరాహార దీక్షలు 


పాడేరురూరల్‌, డిసెంబరు 6: తమను రెన్యువల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఐటీడీఏ వద్ద ఆదివాసీ మాతృభాష వలంటీర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు, జిల్లా ఉపాధ్యక్షుడు కె.నర్సయ్య సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీ మాతృ భాష బోధనలో కీలకపాత్ర పోషిస్తున్న విద్యా వలంటీర్‌లను ప్రభుత్వం తక్షణమే రెన్యువల్‌  చేయాలని డిమాండ్‌ చేశారు. మాతృ భాష విద్యా వ్యవస్థను 2007లో కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షాభియాన్‌ ద్వారా కొండ, కువి, కోయ, ఒడియా భాషల్లో బోధనను ప్రారంభించిందన్నారు. మన్యంలో 708 మంది భాష వలంటీర్‌లు వివిధ పాఠశాలల్లో విద్యను బోధిస్తున్నారన్నారు. ఈ ఏడాది రెన్యువల్‌ చేయకపోవడంతో వేలాది మంది గిరిజన చిన్నారులు విద్యకు దూరమవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వలంటీర్ల సంఘం జిల్లా నాయకులు ఎం.చిట్టిబాబు, కె.చిన్నారావు, పి.కామేశ్వరరావు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement