అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంలో ఓటు శక్తిమంతమైన ఆయుధమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సోమవారం రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడారు.