ప్రత్యేక క్యాంప్‌ల ద్వారా ఓటరు నమోదు

ABN , First Publish Date - 2021-12-02T05:21:45+05:30 IST

ప్రత్యేక క్యాంప్‌ల ద్వారా ఓటరు నమోదు

ప్రత్యేక క్యాంప్‌ల ద్వారా ఓటరు నమోదు
వీసీలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): మేడ్చల్‌ జిల్లాలో ప్రత్యేక క్యాంప్‌లను ఏర్పాటు చేసి, కళాశాలల్లో 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులతో ఓటు హక్కును నమోదు చేయించే కార్యక్రమాన్ని చేపడుతామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ అన్నారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో  ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న కళాశాలల్లో క్యాంప్‌లు ఏర్పాటు చేసి, ఓటుహక్కు ప్రాధాన్యంపై యువతీ, యువకులకు వివరిస్తామన్నారు. మృతిచెందిన, ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారి ఓట్లను  జాబితా నుంచి తొలగిస్తామని తెలిపారు. గరుడ యాప్‌పై బూతు లెవల్‌ అధికారులకు శిక్షణ ఇస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి, డీఆర్వో లింగ్యానాయక్‌, ఎన్నికల సెక్షన్‌ అధికారి పుష్యమి పాల్గొన్నారు.


  • కరోనా వ్యాక్సిన్‌ 100శాతం వేసేందుకు చర్యలు

ప్రజలను చైతన్య పరుస్తూ మేడ్చల్‌ జిల్లాలో కరోనా వాక్సిన్‌ను 100శాతం పూర్తయ్యేలా చర్యలు చేపడుతామని అదనపు కలెక్టర్‌ శ్యాంసన్‌ అన్నారు. కరోనా వాక్సిన్‌పై ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌, సబితారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ని ర్వహించారు. ఈ నెల 31 నాటికి జిల్లాలో వంద శాతం వాక్సినేషన్‌ చేయాలని మంత్రి ఆదేశించారు. మొదటి డోసు వేసుకున్న వేసుకున్న వారికి రెండో డోసు, వేసుకోని వారికి మొదటి డోసు వెంటనే వేయాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ దేవసహాయం, డీపీఓ రమణమూర్తి, డీఆర్డీఓ పద్మజారాణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-02T05:21:45+05:30 IST