Abn logo
Sep 21 2021 @ 23:30PM

ఓటరు నమోదు వేగవంతం చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌డీసీ శాంతి

నరసన్నపేట/పోలాకి: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రిటర్నింగ్‌ అధికారి రవి జోసెఫ్‌ అన్నారు. మంగళవారం నరసన్నపేట, పోలాకి మండలాల్లో బీఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద శని, ఆదివారాల్లో  ఓటరు నమోదు చేయాలని, 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి ఓటు హక్కుపై అవగాహన కలిగించాలన్నారు. కార్యక్రమంలో తహసీలార్లు కె.ప్రవల్లిక ప్రియ, ఎ.సింహాచలం తదితరులు పాల్గొన్నారు. 


అర్హులను ఓటర్లుగా చేర్చాలి

 రాజాం: అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా చేర్చాలని రాజాం నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, భూసేకరణ డిప్యూటీ కలెక్టరు బి.శాంతి ఆదేశించారు. మంగళవారం తహసీల్దారు కార్యాలయంలో బీఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన వారికి అవగాహన కలిగించి ఓటరుగా చేర్చాలన్నారు. అనంతరం ప్రభుత్వం చేపడుతున్న భూసర్వేపై నాలుగు మండలాల తహసీల్దార్లతో సమీక్షించారు. సమావేశంలో తహసీల్దారు పి.వేణుగోపాలరావు, ఎన్నికల డీటీ సాయికామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.