అస్సాం, బెంగాల్‌లో నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే..?

ABN , First Publish Date - 2021-04-02T01:47:37+05:30 IST

అయితే అస్సాంలో పోలింగ్ ప్రశాంతంగానే జరిగినప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో సరిగా జరగలేదని అధికార ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. పోలింగ్ సరళిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేయడం..

అస్సాం, బెంగాల్‌లో నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే..?

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండవ విడత పోలింగ్, అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. కాగా, రెండు రాష్ట్రాల్లో ఓటర్లు పోలింగ్ బూత్‌కు పోటెత్తారు. కాగా, ఈరోజు రెండు రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లో 80.43 శాతం, అస్సాంలో 73.03 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ పేర్కొంది.


రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. బెంగాల్ అయితే రెండు దశల పోలింగ్‌లోనూ 80 శాతం ఓటింగ్ నమోదవడం గమనార్హం. ఈ రెండు రాష్ట్రాల్లో ఇంత పెద్ద మొత్తంలో పోలింగ్ నమోదు కాలేదు. పశ్చిమ బెంగాల్‌లో మరో ఆరు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. ఇక అస్సాంకు మరో విడత పోలింగ్ జరుగనుంది.


అయితే అస్సాంలో పోలింగ్ ప్రశాంతంగానే జరిగినప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో సరిగా జరగలేదని అధికార ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. పోలింగ్ సరళిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేయడం, గవర్నర్‌తో మాట్లాడడం చర్చనీయాంశమైంది. అయితే ఇరు రాష్ట్రాల్లో పోలింగ్‌కు ఎలాంటి అంతరాయం కలగలేదని, ప్రశాంతమైన వాతావరణంలోనే పోలింగ్ కొసాగిందని ఎన్నికల సంఘం పేర్కొంది.

Updated Date - 2021-04-02T01:47:37+05:30 IST