బెంగాల్‌లో ముగిసిన నాలుగో విడత.. 76.16 శాతం పోలింగ్

ABN , First Publish Date - 2021-04-11T00:56:41+05:30 IST

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం..

బెంగాల్‌లో ముగిసిన నాలుగో విడత.. 76.16 శాతం పోలింగ్

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 7 గంటల సమయానికి 76.16 శాతం పోలింగ్ నమోదైంది. కూచ్‌ బెహర్, అలిపుర్దూర్, సౌత్ 24 పరగణాలు, హౌరా, హుగ్లీ జిల్లాల్లోని 44 నియోజకవర్గాల్లో ఈ విడత పోలింగ్ జరిగింది. ఈసారి అదృష్టం పరీక్షించుకుంటున్న ప్రముఖుల్లో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో, పశ్చిమ బెంగాల్ మంత్రులు పార్థ ఛటర్జీ, అరూప్ బిస్వాస్ తదితరులు ఉన్నారు. శనివారం ఉదయం కూచ్ బెహర్‌లోని ఓ పోలింగ్ బూత్ వద్ద కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు టీఎంసీ కార్యకర్తలు మరణించిన ఘటన  సంచలనమైంది. ఇది ప్రధాన ప్రత్యర్థులైన టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ ఘటనపై ఈసీకి తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కాగా, ఐదో విడత పోలింగ్ ఈనెల 17న జరుగనుంది. మొత్తం 8 విడతలుగా జరిగే పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. మే 2న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2021-04-11T00:56:41+05:30 IST