ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకం

ABN , First Publish Date - 2022-01-26T07:00:56+05:30 IST

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వేయడం కీలక మని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకం
ఓటరు గుర్తింపు కార్డును అందజేస్తున్న కలెక్టర్‌

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 25 : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వేయడం కీలక మని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవము సంద ర్భంగా మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌ అని అన్నారు. 1950 జనవరి 25న దేశంలో ఎన్నికల సంఘం ఏర్పాటైందని అందు కొరకు జాతీయ ఓటర్ల దినంగా ప్రకటించి నిర్వహిస్తోందన్నారు. ఇది 12వదని తెలిపారు. దేశాభివృద్ధిలోను రాజకీయాల్లో మంచి నేతను ఎన్నుకునే అవకాశం కేవలం ఓటు ద్వారానే సాధ్యమని అన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రతీ సంవత్సరము ఓటర్ల సవరణ కార్యక్రమం ఉంటుందని 18 ఏళ్లు నిండిన అర్హులందరూ ఓటర్ల జాబితా లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఓటర్లను చైతన్యపర్చడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు. 1 జనవరి 2022 వరకు కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న యువతకు ఫొటో గుర్తింపు కార్డులను అందజేశారు. అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, ఆర్డీవో రమేష్‌ రాథోడ్‌, తహసీల్దార్‌ శివకుమార్‌తో పాటు జిల్లా పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. 

జిల్లా కేంద్రంలో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. డీఈవో రవీందర్‌రెడ్డి కార్యాలయ సిబ్బంది ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని డీఈవో రవీందర్‌రెడ్డి అన్నారు. 18 ఏళ్లునిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్నారు. సూపరెండెంట్‌ భోజన్న, సెక్టోరియల్‌ అధికారి సలోమి కరుణ, నారాయణ పాల్గొన్నారు. 

స్థానిక ఏరియా ఆసుపత్రిలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మంగళవారం నిర్వ హించారు. సూపరెండెంట్‌ దేవేందర్‌రెడ్డి డాక్టర్లు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతీఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. దేశాభివృద్ధికి ఓటు కీలక మన్నారు. ఆర్‌ఎంవో వేణుగోపాలకృష్ణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 

సోఫీనగర్‌ బాలికల గురుకుల విద్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవము మంగళవారం నిర్వహించారు. ఓటు ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. 18 ఏళ్లు నిండినవారు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచిం చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. ప్రిన్సిపాల్‌ గంగాశంకర్‌, సహ ప్రిన్సిపాల్స్‌ వీణరాణి, కల్పన, బి. వెంకట్‌, తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. 

దస్తూరాబాద్‌ : జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళ వారం మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓటరు దినోత్సవము సందర్భంగా మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, యువకులు ప్రతిజ్ఞ చేశారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ శివకుమార్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, గంగన్న, పీవీ నర్సయ్య, పంచాయతీ కార్య దర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, వీఆర్‌ఏలు, నాయకులు, యువజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

కుంటాల : మండల కేంద్రం కుంటాలలోని తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. సందర్భంగా తహసీల్దార్‌ శ్రీధర్‌, ఎస్సై పోగుల సుమాంజలిలు మాట్లాడుతూ ఓటరుకు ఓటు హక్కు ఆ యుధంలాంటిందని అన్నారు. అనంతరం ఓటర్లతో ప్రతిజ్ఙ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్‌రెడ్డి, ఆర్‌ఐ విజయ్‌, తదితరులు న్నారు. 

కుభీర్‌ :  18 సంవత్సరాలు పైబడిన ప్రతీఒక్కరు ఓటుహక్కు కలిగి ఉండా లని తహసీల్దార్‌ సుభాస్‌చంద్ర, ఎంపీడీవో రమేశ్‌లు అన్నారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురష్కరించుకొని కార్యాలయాల్లో ఓటు హక్కుపై ప్రతిజ్ఙ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రామారావు, నవనీత్‌కుమార్‌, డీటీ మల్లారెడ్డి, అంగన్‌వాడీ కార్యకర్తలున్నారు. 

తానూర్‌ : ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ వెంకట రమణ అన్నారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ గంగాధర్‌, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

నర్సాపూర్‌(జి) : మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం, చాక్‌పల్లి గ్రామ పంచాయతీ నందు జాతీయ ఓటరు దినోత్సవము సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జడ్పీటీసీ చిన్న రామ య్య, తహసీల్దార్‌ తుకారాం, డీటీ ముత్యం, ఆర్‌ఐ వేణుగోపాల్‌, ఎస్సై పాకాల గీత, గ్రామస్తులు పాల్గొన్నారు. 

ముథోల్‌ : మండల కేంద్రమైన ముథోల్‌తో పాటు వివిధ గ్రామాల్లో మంగళ వారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్యాంసుందర్‌తో పాటు సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.  ప్రజాస్వామ్యంలో ఓటు విలువైందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T07:00:56+05:30 IST