ఓటు హక్కు తప్పనిసరిగా పొందాలి

ABN , First Publish Date - 2020-12-03T05:05:11+05:30 IST

అర్హత కల్గిన వారందరూ తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని తహసీల్దారు సోమ్లానాయక్‌ పేర్కొన్నారు. తహసీల్దారు కార్యాలయంలో బుధవారం బీఎల్వోలతో సమావేశం నిర్వహించారు.

ఓటు హక్కు తప్పనిసరిగా పొందాలి

ముత్తుకూరు, డిసెంబరు 2: అర్హత కల్గిన వారందరూ తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని తహసీల్దారు సోమ్లానాయక్‌ పేర్కొన్నారు. తహసీల్దారు కార్యాలయంలో బుధవారం బీఎల్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 5, 6 తేదీల్లో, అలాగే 12, 13 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. బీఎల్వోలు తమకు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాల్లో ఆ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. 2020 జనవరి 1వ తేదీకి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు పొందేందుకు అర్హులన్నారు. అర్హత కల్గిన వారంతా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటరు లిస్టును ప్రజలకు అందుబాటులో ఉంచి, ఓటర్ల వివరాలను బీఎల్వోలు తెలియజేస్తారన్నారు. మరణించిన వారు, గ్రామాలను శాశ్వతంగా వదిలి వెళ్లిన వారి వివరాలు తెలుసుకుని, తొలగించేందుకు దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వీఆర్వోలు,  పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-03T05:05:11+05:30 IST