వంటావార్పుతో వీఆర్‌ఏల నిరసన

ABN , First Publish Date - 2022-08-02T05:05:17+05:30 IST

మండల కేంద్రంలో వీఆర్‌ఏల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. నిరవధిక సమ్మె సోమవారం ఏనిమిదవ రోజుకు చేరుకున్నది.

వంటావార్పుతో వీఆర్‌ఏల నిరసన
సమ్మెకు సంఘీభావం తెలుపుతున్న తహసీల్దార్‌ వీరభద్రప్ప

- ఎనిమిదవ రోజుకు చేరిన నిరవధిక సమ్మె

- సంఘీభావం ప్రకటించిన పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు

ఉండవల్లి, ఆగస్టు 1 : మండల కేంద్రంలో వీఆర్‌ఏల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. నిరవధిక సమ్మె సోమవారం ఏనిమిదవ రోజుకు చేరుకున్నది. అందులో భాగంగా సోమవారం ఉండవల్లి తహసీ ల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్‌ఏలు కుటుంబ సభ్యులతో కలిసి వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వ హించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశా రు. తహసీల్దార్‌ వీరభద్రప్ప సమ్మె శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలిపారు.


అయిజ : అయిజ తహసీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్‌ఏలు వంటావార్పు నిర్వహించారు. కార్యక్రమంలో వీఆర్‌ఏలు నాగన్న, పరశురాము, శివ పాల్గొన్నారు.


గట్టు : గట్టు తహసీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్‌ఏలు వంటావార్పు నిర్వహించిన నిరసన తెలి పారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశా రు. అనంతరం కార్యాలయ సిబ్బందితో కలిసి అక్కడే భోజనం చేశారు. 


వడ్డేపల్లి : శాంతినగర్‌లో తహసీల్దార్‌ కార్యా లయం వీఆర్‌ఏలు చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా సోమవారం వంట వార్పు చేసి నిరసన తెలిపారు. సమస్యలను పరిష్కరించే దాకా ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వీఆర్‌ఏలు మమత, లక్ష్మన్న, అనసూయ, బడేసాబ్‌, నాగమణి,  నాగరాజు, ఖాజాహుసేన్‌ పాల్గొన్నారు.  


ధరూరు : ధరూరు మండల కేంద్రంలోని తహసీ ల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్‌ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా సోమవారం వంటావార్పు చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు గోపాల్‌, వీఆర్‌ఏలు ఆంజనేయులు, తిమ్మప్ప, రాజు, నాగేంద్రమ్మ పాల్గొన్నారు.




Updated Date - 2022-08-02T05:05:17+05:30 IST