వీఆర్‌ఏలకు కనీసవేతనం ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-06-22T05:43:13+05:30 IST

గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్‌ఏ) పే స్కేల్‌ అమలుచేయాలని కోరుతూ రూరల్‌ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

వీఆర్‌ఏలకు కనీసవేతనం ఇవ్వాలి

నిజామాబాద్‌ రూరల్‌, జూన్‌ 21 : గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్‌ఏ) పే స్కేల్‌ అమలుచేయాలని కోరుతూ రూరల్‌ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సోమవారం రూరల్‌ వీఆర్‌ఏలు రూరల్‌ తహసీల్‌ కార్యాలయానికి తరలివచ్చారు. తహసీల్దార్‌ లేకపోవడంతో నాబయ్‌ తహసీల్దార్‌కు ప్రియాంకకు తమ సమస్యలు మొరపెట్టుకున్నారు. వీఆర్‌ఏలకు కనీస వేతనం రూ. 22,400/- మంజూరుచేయాలని కోరారు. అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి వీఆర్‌ఏలకు అన్ని వసతులు కల్పించాలని 60 ఏళ్లు నిండినవారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడం, ఒకవేళ మరణిస్తే ఖర్చులకు రూ.20 వేలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రూరల్‌ వీఆర్‌ఏల అధ్యక్షుడు ముచ్కూరి సదానంద్‌, లక్ష్మణ్‌, జనార్ధన్‌, గంగాధర్‌, గంగాధర్‌, కొమరయ్య, నరేందర్‌, సతీష్‌, అభిలాష్‌, ధర్మారం గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-22T05:43:13+05:30 IST