వృక్షాసనంతో ఏకాగ్రత

ABN , First Publish Date - 2020-06-15T05:30:00+05:30 IST

ఈ ఆసనం చెట్టు ఆకారాన్ని తలపిస్తుంది. అందుకే ‘వృక్షాసనం’ అంటారు. ఈ ఆసనం రోజూ వేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. తొడకండరాలు బలోపేతం...

వృక్షాసనంతో ఏకాగ్రత

ఈ ఆసనం చెట్టు ఆకారాన్ని తలపిస్తుంది. అందుకే ‘వృక్షాసనం’ అంటారు. ఈ ఆసనం రోజూ వేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. తొడకండరాలు బలోపేతం అవుతాయి. 


ఎలా వేయాలంటే...

  1. ముందుగా నిల్చొని  కాళ్లు, చేతులు నిటారుగా ఉంచాలి. 
  2. ఇప్పుడు కుడి కాలును కొద్దిగా పైకి లేపి, ఎడమ కాలు తొడ మీద పెట్టాలి. 
  3. రెండు అరచేతులూ కలిపి నమస్కారం పెడుతూ చేతులను తలమీదుగా పైకి లేపాలి. ఈ పొజిషన్‌లో కనీసం 30 సెకన్ల పాటు ఉండాలి. 
  4. తిరిగి నెమ్మదిగా చేతులు కిందకు తీసుకురావాలి. కుడికాలును యథాస్థానానికి తీసుకురావాలి. 
  5. తరువాత అదే పద్ధతిలో ఎడమ కాలుతో చేయాలి.
  6. ప్రారంభంలో ఒంటి కాలిపై నిలబడటం కష్టమవుతుంది. అలాంటప్పుడు గోడను ఆసరాగా చేసుకొని నిల్చొని చేయవచ్చు.

Updated Date - 2020-06-15T05:30:00+05:30 IST