స్విమ్మింగ్‌లో విృతికి స్వర్ణం

ABN , First Publish Date - 2021-10-22T08:55:42+05:30 IST

జాతీయ జూనియర్‌ అక్వాటిక్‌ చాంపియన్‌షి్‌ప బాలికల 1500 మీటర్ల ఈవెంట్‌లో హైదరాబాదీ విృతి అగర్వాల్‌ స్వర్ణంతో మెరిసింది.

స్విమ్మింగ్‌లో విృతికి స్వర్ణం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ జూనియర్‌ అక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌ బాలికల 1500 మీటర్ల ఈవెంట్‌లో హైదరాబాదీ విృతి అగర్వాల్‌ స్వర్ణంతో మెరిసింది. బెంగళూరులో జరుగుతున్న ఈ పోటీల్లో మూడో రోజైన గురువారం ముగిసిన బాలికల 50 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో శ్రీనిత్య, బాలురలో సుహాస్‌ ప్రీతమ్‌ కాంస్యాలు సాధించారు. బాలుర 200 మీ. మెడ్లేలో యశస్వి కాంస్యంతో మెరవగా, బాలికల 4-100 మీ. ఫ్రీస్టయిల్‌ రిలేలో లాస్య, సహస్ర, మోక్షిత, నిత్య కలిసి కాంస్యం సాధించారు.

Updated Date - 2021-10-22T08:55:42+05:30 IST