వీఆర్వోలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి : కలెక్టర్‌ గౌతమ్‌

ABN , First Publish Date - 2020-05-13T07:03:30+05:30 IST

గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో) క్షేత్ర స్థాయిలో పర్యటించాలని కలెక్టర్‌ వీపీ. గౌతమ్‌ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో

వీఆర్వోలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి : కలెక్టర్‌ గౌతమ్‌

మహబూబాబాద్‌ టౌన్‌, మే 12: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో) క్షేత్ర స్థాయిలో పర్యటించాలని కలెక్టర్‌ వీపీ. గౌతమ్‌ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం రెవెన్యూ కార్యకలపాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ప్రభుత్వ భూములను పరిరక్షించుకునేందుకు పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. అదనపు కలెక్టర్‌ ఎం.వెంకటేశ్వర్లు, మానుకోట, తొర్రూరు ఆర్డీవోలు కొమురయ్య, ఈశ్వరయ్య, శివాజీ గణేష్‌, వెంకటరమణ, రాంబాబు పాల్గొన్నారు.


పనులను వేగవంతంగా చేయాలి

మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశించారు. మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం జిల్లాలోని మహబూబాబాద్‌, డోర్నకల్‌, మరిపెడ, తొర్రూరు మునిసిపాలిటీల్లో చేపడుతున్న ప్రగతిని మునిసిపల్‌ కమిషనర్లు, ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. మునిసిపాలిటీల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఎం. వెంకటేశ్వర్లు, అధికారులు రవీందర్‌, ధన్‌సింగ్‌, రంజిత్‌, ఇంద్రసేనారెడ్డి, బాబు, వెంకటేశ్వర్లు, రాజేశ్వర్‌, రాంబాబు పాల్గొన్నారు.


కొనుగోలు కేంద్రంలో ఇబ్బందులపై ఫిర్యాదు

ధాన్యం కొనుగోలు కేంద్రంలో 16 రోజులుగా సరుకులు పోసి ఎండా, వాన, పశువులతో ఇబ్బందులు పడుతున్నామని పెనుగొండకు చెందిన రైతులు జె.వెంకన్న, దారం పరుశురాములు, ముదిగిరి కొమురయ్య, మంగ కుమారస్వామి తదితరులు జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌కు మంగళవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 16 రోజులుగా కాంటాలు పెట్టడంలేదని, అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని వెంటనే కాంటాలు పెట్టించి, ఎగుమతి చేయాలని కోరారు. 

Updated Date - 2020-05-13T07:03:30+05:30 IST