Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీఆర్‌వోల నిరసన

మంత్రి అప్పలరాజు, పలాస కమిషనర్‌ క్షమాపణ చెప్పాలి

తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నల్ల బ్యాడ్జీలతో ఆందోళన 


నిడదవోలు, డిసెంబరు 2 :అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి అప్పల రాజు, పలాస మునిసిపల్‌ కమిషనర్‌ రాజగోపాలరావు క్షమాపణ చెప్పాలని వీఆర్‌వోలు డిమాండ్‌ చేశారు. నిడదవోలు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద  గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ శాఖను, వీఆర్‌వోలను కించపరుస్తూ మాట్లాడడం తగదన్నారు. ఈ సందర్భంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ విధులకు హాజరయ్యారు. సర్వేశ్వరరావు, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

గణపవరం, డిసెంబరు 2 :వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు, పలాస మునిసిపల్‌ కమిషనర్‌ రాజగోపాలరావు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వీ ఆర్వోల సంఘ మండల అధ్యక్షుడు నిడమర్తి కేశవమూర్తి ఖండించారు. గురు వారం నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్‌వోలకు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో దశల వారీగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

ఉంగుటూరు, డిసెంబరు 2 :వీఆర్‌వోలపై రాష్ట్ర మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం మండల వీఆర్‌వోల సంఘం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఽధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మండల సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందమూరి ఉమా మహేఽశ్వరరావు, ఉపాధ్యక్షుడు జగన్నాథం, సభ్యులు రమణ, ఆముదాల శ్రీను, కుచ్చు వెంకటేశ్వరరావు, రమేష్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement