Advertisement
Advertisement
Abn logo
Advertisement

నల్లబ్యాడ్జీలతో వీఆర్‌వోల నిరసన

నాయుడుపేట టౌన్‌, డిసెంబర్‌ 6 : రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని గ్రామ రెవెన్యూ అధికారులు నాయుడుపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో సరోజినికి వినతిపత్రం అందజేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి, మున్సిపల్‌ కమిషనర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని ఎడల దశల వారీ ఉద్యమం కొనసాగిస్తామని వినతిపత్రంలో తెలిపినట్లు వీఆర్‌వో సంఘ నాయకులు తెలిపారు.

Advertisement
Advertisement