Abn logo
Feb 22 2020 @ 05:13AM

అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు

డుంబ్రిగుడ, ఫిబ్రవరి 21 : మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు సరఫరా చేస్తున్నారు. డుంబ్రిగుడ పంచాయతీలో గురువా రం కుళ్లిన గుడ్డు తిన్న ఓ చిన్నారి అస్వస్థతకు గురయ్యాడు. పంచాయతీకి చెందిన ఎస్‌. జయరాజు కుమారుడు ఎప్పటిలాగే కేంద్రానికి వెళ్లగా సిబ్బంది గుడ్డు అందించారు. అది తిన్న కొద్దిసేప టికే వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కేంద్రం సిబ్బంది తల్లి దండ్రులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. మండల వ్యాప్తంగా కొద్ది రోజులుగా గుడ్లు సరఫరా ఇదేవిధంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 50 గ్రాముల బరువు ఉన్న గుడ్డు పంపిణీ చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్‌ తక్కువ పరిమాణంలో ఉన్న వాటిని ఇస్తున్నారు. వాటిల్లోనూ చాలావరకు కుళ్లినవే ఉంటు న్నాయి. అధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నా.. పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈవిషయమై ఐసీడీఎస్‌ సీడీపీఓ జి.ఉషారాణిని ‘ఆంధ్రజ్యోతి’ వివ రణ కోరగా గుడ్లలో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. డుంబ్రిగుడ పంచాయతీకి సరఫరా చేసిన గుడ్లు కుళ్లినట్టు తమ దృష్టికి రాలేద న్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement