ఉక్కు ప్రైవేటీకరణపై ప్రజా చైతన్యానికి బైక్‌ యాత్ర

ABN , First Publish Date - 2021-04-14T06:18:34+05:30 IST

ఉక్కు కర్మాగార పరిరక్షణ కోరుతూ లక్ష సంతకాల సేకరణకు శ్రీహరిపురం వీల్‌ క్లబ్‌కు చెందిన బైక్‌ రైడర్‌ బి.నీల మోహన్‌ ఉత్తరాంధ్ర బైక్‌ యాత్ర చేపట్టారు.

ఉక్కు ప్రైవేటీకరణపై ప్రజా చైతన్యానికి బైక్‌ యాత్ర
నీలమోహన్‌ బైక్‌ యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తున్న గంధం వెంకటరావు

లక్ష సంతకాల సేకరణ లక్ష్యం

కూర్మన్నపాలెం,ఏప్రిల్‌ 13: ఉక్కు కర్మాగార పరిరక్షణ కోరుతూ లక్ష సంతకాల సేకరణకు  శ్రీహరిపురం వీల్‌ క్లబ్‌కు చెందిన బైక్‌ రైడర్‌ బి.నీల మోహన్‌ ఉత్తరాంధ్ర  బైక్‌ యాత్ర చేపట్టారు.  ఉక్కు ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరం వద్ద ఈ బైక్‌ యాత్రను మంగళవారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్‌ గంధం వెంకటరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నీల మోహన్‌ మాట్లాడుతూ లక్ష సంతకాలు సేకరించి ఈ నెల 18న ఆర్‌.కె,.బీచ్‌లో జరిగే కార్మిక రైతు శంఖారావం వేదిక పైకి తీసుకు వచ్చి అక్కడ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి అందజేస్తానన్నారు. అనంతరం సంతకాల సేకరణ ప్రతులను భారత ప్రధాని నరేంద్ర మోదీకి పంపుతానన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవమైన స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవలసిన బాధ్యత  అందరిపై ఉందన్నారు. 

    



Updated Date - 2021-04-14T06:18:34+05:30 IST