ద్వారకానగర్‌లో బారులు తీరిన ప్రజలు

ABN , First Publish Date - 2020-09-23T07:53:16+05:30 IST

ఆధార్‌ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ద్వారకానగర్‌లో ఏర్పాటు చేసిన ఆధార్‌ కేంద్రం వద్ద

ద్వారకానగర్‌లో బారులు తీరిన ప్రజలు

ఆధార్‌ కేంద్రం వద్ద బారులు 

మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు


విశాఖపట్నం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి) : ఆధార్‌ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ద్వారకానగర్‌లో ఏర్పాటు చేసిన ఆధార్‌ కేంద్రం వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధ్ది పొందడానికి ఆధార్‌లో ఉన్న వివరాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.


దీంతో చాలామంది ఆయా పథకాల లబ్ధిని పొందేందుకు ఆధార్‌లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వస్తున్నారు. ప్రతిరోజూ 600 మందికి ఈ ఆధార్‌ కేంద్రంలో సేవలు అందిస్తున్నారు. ఇందులో సుమారు 100 వరకు కొత్త వాటి కోసం వస్తుండగా, మిగిలిన 400 వరకు మార్పులు, చేర్పులు కోసం వస్తున్నవారే ఉంటున్నారు.


మరో 50 వరకు బయోమెట్రిక్‌ పడకపోవడం వంటి సమస్యలతో వస్తున్నట్టు ఆధార్‌ కేంద్రం అధికారులు చెబుతున్నారు. భవన యజమానులు ఒకసారి 25 మందిని మాత్రమే లోపలకు అనుమతిస్తుండడం వల్ల బయట వందలాది మంది ఉంటున్నారు. 

Updated Date - 2020-09-23T07:53:16+05:30 IST