నిలకడగా కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-28T09:17:47+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ బారిన పడినవారి సంఖ్య నిలకడగా ఉంది. తాజాగా మంగళవారం 106 మందికి వైరస్‌ సోకింది. దీంతో జిల్లాలో కరోనా సోకిన వారి సంఖ్య 55,827కు చేరింది.

నిలకడగా కరోనా కేసులు

జిల్లాలో మరో 106 మందికి వైరస్‌ 

55,827కు చేరిన మొత్తం పాజిటివ్‌ కేసులు

చికిత్స పొందుతూ ఒకరి మృతి


సిరిపురం , అక్టోబరు 27 : జిల్లాలో కరోనా వైరస్‌ బారిన పడినవారి సంఖ్య నిలకడగా ఉంది. తాజాగా మంగళవారం 106 మందికి వైరస్‌ సోకింది. దీంతో జిల్లాలో కరోనా సోకిన వారి సంఖ్య 55,827కు చేరింది. వీరిలో 53,179 మంది డిశ్చార్జ్‌ కాగా ఇంకా 2176 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 472కు చేరింది. నగరం కంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. శీతాకాలం ప్రారంభం కానుందని, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


98వ వార్డులో ముగ్గురికి..

సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 98వ వార్డుకు చెందిన 54 మందికి కరోనా యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారి డాక్టర్‌ ఎ.వాసుదేవరావు తెలిపారు. 

Updated Date - 2020-10-28T09:17:47+05:30 IST