జిల్లాలో 3.8 లక్షల మందికి రైతు భరోసా

ABN , First Publish Date - 2020-10-28T09:20:50+05:30 IST

రైతుభరోసా పథకం కింద ఈ సంవత్సరం అక్టోబరు నెలాఖరు నాటికి జిల్లాలో 3,80,991 మంది అర్హులైన రైతు కుటుంబాలకు వారి ఖాతాల్లో రూ.95.02 కోట్లు జమ చేయటం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు.

జిల్లాలో 3.8 లక్షల మందికి రైతు భరోసా

రెండో విడత రూ.95.02 కోట్లు జమ


మహారాణిపేట, అక్టోబరు 27: రైతుభరోసా పథకం కింద ఈ సంవత్సరం అక్టోబరు నెలాఖరు నాటికి జిల్లాలో 3,80,991 మంది అర్హులైన రైతు కుటుంబాలకు వారి ఖాతాల్లో రూ.95.02 కోట్లు జమ చేయటం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహనరెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్‌ రైతుభరోసా పీఎం కిసాన్‌ రెండో విడత నగదును విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వీరిలో వ్యవసాయ, కౌలు, దేవదాయ, అసైన్డ్‌, అటవీ భూముల రైతులు ఉన్నారని తెలిపారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతుభరోసా పథకం రైతుల పాలిట వరమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో జిల్లాకు చెందిన పలువురు మహిళలు మాట్లాడారు. జారుంట్‌ కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బి.సత్యవతి, శాసనసభ్యులు కన్నబాబురాజు, గొల్ల బాబూరావు, గుడివాడ అమర్‌, అదీప్‌రాజ్‌, భాగ్యలక్ష్మి, వాసుపల్లి గణేశ్‌కుమార్‌, వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లీలావతి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-28T09:20:50+05:30 IST