మరికొన్ని రైళ్ల రాకపోకల వేళలు మార్పు

ABN , First Publish Date - 2021-01-17T05:27:30+05:30 IST

విశాఖ-రాయగడ, విశాఖ-పలాస మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్ల వేళలు మార్పు చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు.

మరికొన్ని రైళ్ల రాకపోకల వేళలు మార్పు

విశాఖపట్నం, జనవరి 16 : విశాఖ-రాయగడ, విశాఖ-పలాస మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్ల వేళలు మార్పు చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు. సవరించిన కొత్త వేళలు ఈ నెల 18 నుంచి అమల్లో రానున్నాయని పేర్కొన్నారు. 

రాయగడ-విశాఖ-రాయగడ

08507 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 18 నుంచి ప్రతిరోజు ఉదయం 5:40 గంటలకు రాయగడలో బయలుదేరి అదే రోజు ఉదయం 10:00 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08508 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 18 నుంచి ప్రతిరోజు సాయంత్రం 6:00 గంటలకు విశాఖలో బయలుదేరి అదేరోజు రాత్రి 10:05 గంటలకు రాయగడ చేరుతుంది. 

పలాస-విశాఖ-పలాస

08531 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 18 నుంచి ప్రతిరోజు ఉదయం 5:00 గంటలకు పలాసలో బయలుదేరి అదేరోజు ఉదయం 9:25 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08532 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 18 నుంచి ప్రతిరోజు సాయంత్రం 5:45 గంటలకు విశాఖలో బయలుదేరి అదేరోజు రాత్రి 10:00 గంటలకు పలాస చేరుతుంది. 

Updated Date - 2021-01-17T05:27:30+05:30 IST