ఉచిత న్యాయసేవలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-07T03:49:30+05:30 IST

ఉచిత న్యాయసేవలను ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని న్యాయసేవాధికార సంస్ధ జిల్లా కార్యదర్శి, సీనియర్‌ సీవిల్‌ జడ్జి ఎం శ్రీనివాసులు తెలిపారు. సోమవారం మండల పరిధిలోని చెముడుగుంట పంచాయతీ పరిధిలో ఉన్న జిల్లా కేంద్ర కారాగారాన్ని ఆయన సందర్శిం

ఉచిత న్యాయసేవలను సద్వినియోగం చేసుకోవాలి
మాట్లాడుతున్న శ్రీనివాసులు నాయక్‌

వెంకటాచలం, డిసెంబరు 6 : ఉచిత న్యాయసేవలను ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని న్యాయసేవాధికార సంస్ధ జిల్లా కార్యదర్శి, సీనియర్‌ సీవిల్‌ జడ్జి ఎం శ్రీనివాసులు తెలిపారు.  సోమవారం మండల పరిధిలోని చెముడుగుంట పంచాయతీ పరిధిలో ఉన్న జిల్లా కేంద్ర కారాగారాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీల యోగక్షేమాలు, వారి  కేసుల వివరాలు, భోజన వసతి, వైద్య సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఖైదీలు ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా మెలగాలన్నారు. కార్యక్రమంలో జైలర్‌ వీ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-12-07T03:49:30+05:30 IST