అవి 30 దేశాల నుంచి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భారత్ వస్తాయి.. శవాలను పీక్కుతినడంతోనే అవి చనిపోతున్నాయంటున్న శాస్త్రవేత్తలు!

ABN , First Publish Date - 2021-12-02T13:45:08+05:30 IST

గ్రామాల్లో, అడవుల్లో కనిపించే రాబందులు కొంతకాలంగా..

అవి 30 దేశాల నుంచి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భారత్ వస్తాయి.. శవాలను పీక్కుతినడంతోనే అవి చనిపోతున్నాయంటున్న శాస్త్రవేత్తలు!

గ్రామాల్లో, అడవుల్లో కనిపించే రాబందులు కొంతకాలంగా కనుమరుగువుతున్నాయి. రాబందులకు చెందిన 9 ప్రజాతులు భారత్‌లో కనిపించాయి. వీటిలో ఒకటే సినోరియస్ రాబందు. దీనిని యూరేషియన్ బ్లాక్ వల్చర్ అనికూడా అంటారు. గతంలో ఈ రాబందులు అనేకం కనిపించేవి. అయితే గత దశాబ్ధకాలంలో ఈ రకానికి చెందిన రాబందులు కనిపించడం లేదు. నేపాల్, పాకిస్తాన్‌లలో గతంలో వీటి సంఖ్య అధికంగా ఉండేది. అయితే ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పశ్చిమ రాజస్థాన్‌లో యూరేషియన్ బ్లాక్ వల్చర్ రాబందు కనిపించి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా జంతుశాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ రేణు కోహ్లీ మాట్లాడుతూ ఈ తరహా పక్షులు మనుషుల మృతదేహాలను తింటాయని, ఫలితంగా వాటి శరీరం విషతుల్యమై చనిపోతున్నాయన్నారు. ఇదే ఈ పక్షులు కనుమరుగు కావడానికి ప్రధాన కారణమన్నారు. కాగా చలికాలం ప్రారంభం కావడంతోనే మధ్య ఆసియాలోని 30 దేశాల నుంచి దాదాపు 5000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వలస పక్షులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకుంటాయి. 


ప్రస్తుతం రాజస్థాన్‌లోని బికనేర్ నగరానికి ఆనుకుని ఉన్న జోర్బీర్ రాబందుల సంరక్షణ కేంద్రంలో దాదాపు 3,000 పక్షులు విడిది చేశాయి. ఐదు నెలల పాటు ఈ పక్షులు ఇక్కడ ఉంటాయి. మూడు హైటెన్షన్ లైన్లు, రెండు రైల్వే విద్యుత్ లైన్లు ఈ పరిరక్షణ కేంద్రం మీదుగా వెళ్లడం కారణంగా రాబందులు వీటిని తాకి చనిపోతున్నాయి. ఇక్కడ రెండు వారాల్లో ఏడు పక్షులు మృతి చెందినట్లు పక్షి ప్రేమికులు తెలిపారు. చనిపోయిన ఏడు పక్షులలో మూడింటి మరణానికి వ్యాధి కారణం అని వైద్యులు తెలిపారు. కాగా ఈసారి వలస వస్తున్న పక్షుల సంఖ్య పెరగడం విశేషం. ఈజిప్షియన్ రాబందు, సినోరియస్ రాబందు, యురేసియన్ గిఫ్రాన్, టోనీ ఈగిల్, స్టెప్పీ ఈగిల్, లాగర్ ఫాల్కన్, గ్రేట్ గ్రే ష్రైక్ వంటి దాదాపు 170 రకాల పక్షులు ఈ సంవత్సరం బికనీర్‌లోని వివిధ ప్రదేశాలలో కనిపించాయి.

Updated Date - 2021-12-02T13:45:08+05:30 IST