Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైఎస్‌ఆర్‌ మహానేత: ఉండవల్లి

హైదరాబాద్‌: మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ ఒక మహానేత అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కొనియాడారు. వైఎస్‌ఆర్ సతీమణీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని  వైఎస్‌ఆర్ 12 వర్థంతిని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్‌కుమార్ మట్లాడుతూ రాజకీయాల్లో వైఎస్‌ఆర్‌ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని తెలిపారు. వైఎస్‌ఆర్‌ జీవితాంతం ప్రజల గురించే పరితపించారని, వైఎస్‌ఆర్‌ను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని ఉండవల్లి చెప్పారు. వైఎస్‌ఆర్‌కు న్యాయ విషయాల్లో పరిజ్ఞానం ఎక్కువ అని న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ తెలిపారు. వైఎస్‌ఆర్‌ విపక్ష ఎమ్మెల్యేలను కూడా సమాన భావంతో చూసేవారని తెలిపారు. వైఎస్‌ఆర్‌ చాలా సహృదయులని కొనియాడారు. వైఎస్‌ఆర్‌ జాతీయవాది, ప్రాంతీయతత్వం అంటగట్టడం సరికాదని హితవుపలికారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని రవిశంకర్‌ చెప్పారు.

Advertisement
Advertisement