వీవీప్యాడ్స్‌ మిషనింగ్‌ విజయవంతం

ABN , First Publish Date - 2021-10-25T05:09:07+05:30 IST

ఈవీఎం/వీవీప్యాడ్స్‌ ప్రక్రియ విజయవంతం చేసిందని బద్వేలు ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ పేర్కొన్నారు.

వీవీప్యాడ్స్‌ మిషనింగ్‌ విజయవంతం
మిషనింగ్‌ ప్రక్రియ పరిశీలిస్తున్న దృశ్యం

బద్వేలు,అక్టోబరు 24: ఈవీఎం/వీవీప్యాడ్స్‌ ప్రక్రియ విజయవంతం చేసిందని బద్వేలు ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ పేర్కొన్నారు. ఆదివారం బాలయోగి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజంట్ల సమక్షంలో కేతన్‌గార్గ్‌ మాట్లాడుతూ

ఎలాంటి పొరపాట్లకు తావ్వివ్వకుండా జాగ్రత్తగా ప్రత్యేక దృష్టితో పూర్తి చేశామన్నారు. 38 టేబుల్స్‌ఏర్పాటు చేసి 10 టేబుల్స్‌ రిజర్వు చేసి ఉంచామన్నారు. ఈవీ ఎం ప్యాడ్స్‌లోని సమాచారం క్లియర్‌ చేసి నిర్దేశించిన స్ర్టాంగ్‌ రూమ్‌ కు పంపి భద్రపరిచాన్నారు. కార్యక్రమంలో సాధారణ పరిశీలకులు భీష్మకుమార్‌, జేసి గౌతమి, ఉప ఎన్నికల సహాయ రిటర్నింగ్‌ అధికారిశ్రీనివాసులరెడ్డి, తహశీల్దార్లు సుబ్రహ్మణ్యం రెడ్డి, శివరామిరెడ్డి, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T05:09:07+05:30 IST