భరత్‌ నైపుణ్యం ద్రవిడ్‌కు తెలుసు

ABN , First Publish Date - 2021-11-29T09:11:50+05:30 IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు వికెట్‌కీపర్‌ సాహా స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన తెలుగు కుర్రాడు కేఎస్‌ భరత్‌ అందరినీ ఆకర్షించాడు.

భరత్‌ నైపుణ్యం ద్రవిడ్‌కు తెలుసు

వీవీఎస్‌ లక్ష్మణ్‌

కాన్పూర్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు వికెట్‌కీపర్‌ సాహా స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన తెలుగు కుర్రాడు కేఎస్‌ భరత్‌ అందరినీ ఆకర్షించాడు. అయితే అతడి నైపుణ్యం గురించి గతంలోనే తనకు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పాడని మాజీ బ్యాటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలిపాడు. ‘భారత క్రికెట్‌లో వృద్ధిమాన్‌ సాహా తర్వాత అంతటి నైపుణ్యం కలిగిన కీపర్‌ భరత్‌ మాత్రమేనని ద్రవిడ్‌ ఓ సందర్భంలో నాతో అన్నాడు. సెలెక్టర్లు, కోచ్‌ నమ్మకాన్ని భరత్‌ నిలబెట్టుకోవడం సంతోషకరం. స్పిన్‌ పిచ్‌పై కీపర్లు బంతి అందుకోవడం అంత సులువు కాదు. కానీ శనివారం ఆటలో భరత్‌ చాలా ఆత్మవిశ్వాసంతో అద్భుత ప్రదర్శన చూపాడ’ని లక్ష్మణ్‌ కొనియాడాడు.

Updated Date - 2021-11-29T09:11:50+05:30 IST