ఆఫ్‌ స్టంప్‌పై దృష్టిపెట్టు

ABN , First Publish Date - 2021-06-16T06:40:17+05:30 IST

వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నేపథ్యంలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ విలువైన సూచనలు చేశాడు. ఆఫ్‌ స్టంప్‌నకు ఆవలగా వెళ్లే బంతులను వదిలేయమని...

ఆఫ్‌ స్టంప్‌పై దృష్టిపెట్టు

  • రోహిత్‌కు లక్ష్మణ్‌ సూచన

న్యూఢిల్లీ: వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నేపథ్యంలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ విలువైన సూచనలు చేశాడు. ఆఫ్‌ స్టంప్‌నకు ఆవలగా వెళ్లే బంతులను వదిలేయమని సలహా ఇచ్చాడు. అలాగే బౌల్ట్‌ బౌలింగ్‌లో బంతి లోపలికి స్వింగ్‌ అయ్యే అవకాశం ఉండడంతో.. కాళ్లను మరీ అడ్డంగా ఉంచేందుకు ప్రయత్నించవద్దని చెప్పాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఈ రెండు విషయాలను రోహిత్‌ గుర్తుంచుకోవాలని స్టార్‌ స్పోర్ట్స్‌ మంగళవారం ఏర్పాటు చేసిన వర్చువల్‌ మీడియా సమావేశంలో లక్ష్మణ్‌ చెప్పాడు. హిట్‌మ్యాన్‌కు జోడీగా శుభ్‌మన్‌ గిల్‌ను కొనసాగించాలని చెప్పాడు. 

Updated Date - 2021-06-16T06:40:17+05:30 IST