వైభవంగా గురుపూర్ణిమ వేడుకలు

ABN , First Publish Date - 2021-07-25T02:57:22+05:30 IST

వాడవాడలా గురుపౌర్ణమి వేడుకలు శనివారం మండలంలో వైభవంగా జరిగాయి.

వైభవంగా గురుపూర్ణిమ వేడుకలు
బాబా మందిరంలో పూజలు నిర్వహిస్తున్న సీఐ దంపతులు

పొదలకూరు, జూలై 24 : వాడవాడలా గురుపౌర్ణమి వేడుకలు శనివారం మండలంలో వైభవంగా జరిగాయి. పట్టణంలో షిరిడి సాయిబాబా మందిరంలో ఉదయం 7గంటలకు ప్రణవ పతాకావిష్కరణతో గురుపూర్ణిమ మహోత్సవ వేడుకలు ప్రారంభమైయ్యాయి.స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ధుని పూజలు జరిపారు. ఓం సాయి శ్రీసాయి జయజయసాయి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్ర్మోగింది. షిరిడిసాయి సేవా సమితి సొసైటీ కార్యదర్శి నాగిశెట్టి దామోదరరావు, సభ్యుడు లక్కాకుల ఆనందరావు మాట్లాడుతూ వేడుకల్లో భాగంగా ఆలయానికి వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, అలాగే భౌతిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో షిరిడిసాయి సేవా సమితి సొసైటీ అధ్యక్షుడు చీమకుర్తి శంకర్‌ ప్రసాద్‌, సభ్యులు పి.సుబ్బానాయుడు, నున్నా రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.   

బుచ్చిరెడ్డిపాళెం : బుచ్చి పట్టణంతోపాటు మండలంలోని జొన్నవాడ, చెల్లాయపాళెం, రేబాల, మునులపూడి, తదితర గ్రామాల్లో  గురుపౌర్ణమిని   ఘనంగా నిర్వహించారు. సాయిబాబా, వెంకయ్యస్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి వార్ల మందిరాల్లో భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా   మందిరాల్లో ఉదయం బాబాకు, వెంకయ్యస్వామి వార్లకు పాలు, పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి పలువురికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే జొన్నవాడ తిప్పమీద ఉన్న వివేకానంద ఆశ్రమంలో శ్రీ శివానందస్వామిని కర్నూలు నుంచి వచ్చిన  భక్తులు  పూలమాలలతో సత్కరించి, అనంతరం గురుభక్తితో పాదపూజ చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాధువులకు వస్ర్తాలు పంపిణీ చేశారు.  

Updated Date - 2021-07-25T02:57:22+05:30 IST