Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైభవంగా ధన్వంతరి జయంతి

బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు 2: మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వావి, కామాక్షితాయి ఆలయంలో గురువారం ధన్వంతరి జయంతి సందర్భంగా ఆలయ అర్చకులు, పండితులు, పురోహితులు ధన్వంతరి హోమం, ఆయుష్‌ హోమం నిర్వహించారు. ముందుగా ప్రజల ఆయురాగ్యాలతో ఉండాలన్న సంకల్పంతో ఆలయంలోని యాగశాలలో ఈ హోమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఏవీ. శ్రీనివాసులురెడ్డి, చైర్మన్‌ చీమల రమేష్‌బాబు, సభ్యులు గుమ్మా ప్రమీలమ్మ, ఇన్నమూరి నరసింహరావు, భక్తులు పాల్గొన్నారు.  

ఇందుకూరుపేట  : ఇందుకూరుపేటలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం ధన్వంతరి జయంతి సందర్భంగా హోమం, విశేష పూజలు నిర్వహించారు. దేవదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ధన్వంతరి హోమాలు, ఆయుష్షు హోమాలు, నరసింహ హోమాలు ఆలయ అర్చకులు శేషాచార్యులు పర్యవేక్షణలో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్‌ భానుచంద్రశేఖర్‌, వెంకటేశ్వరరావు, శేషగిరిరావు, శివాలయం అర్చకులు మణిశంకర్‌, లలిత ఆశ్రమ పీఠాధిపతి రామాయణం మహేష్‌ స్వామి, నందకిషోర్‌, రంగాచార్యులు, నరేష్‌ పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement