Abn logo
Oct 24 2020 @ 09:53AM

ప్రభాస్ ఫ్యాన్స్‌కు నాగ్ అశ్విన్ హామీ!

Kaakateeya

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ రూపొందించబోయే సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఏమైనా వస్తుందేమోనని అభిమానులు ఎదురుచూశారు. అయితే ఈ ఏడాది కాదు కానీ.. వచ్చే ఏడాది ప్రభాస్ పుట్టిన రోజుకు మంచి గిఫ్ట్ ఇస్తామని వైజయంతీ మూవీస్ సంస్థ ట్విటర్ ద్వారా ప్రామిస్ చేసింది. 


వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనబడుతున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడని టాక్. ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 


Advertisement
Advertisement