ఫిషింగ్‌హార్బర్‌ నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతం పరిశీలన

ABN , First Publish Date - 2021-07-29T05:43:23+05:30 IST

మండల పరిధిలోని వాడరేవు సముద్రతీరం వద్ద ఫిషింగ్‌హార్బర్‌ నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాన్ని బుధవారం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తహసీల్దార్‌ మహ్మద్‌హుస్సేన్‌తో కలసి పరిశీలించారు.

ఫిషింగ్‌హార్బర్‌ నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతం పరిశీలన
కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు హద్దులు చూపుతున్న తహసీల్దార్‌ మహ్మద్‌హుస్సేన్‌

చీరాల, జూలై 28 : మండల పరిధిలోని వాడరేవు సముద్రతీరం వద్ద ఫిషింగ్‌హార్బర్‌ నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాన్ని బుధవారం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తహసీల్దార్‌ మహ్మద్‌హుస్సేన్‌తో కలసి పరిశీలించారు. తహసీల్దార్‌ తీరం వెంట ఫి షింగ్‌హార్బర్‌కు కేటాయించిన స్థలం హద్దులను క లెక్టర్‌కు చూపించారు. ఆ భూమిలో ఆక్రమణలు, సానుకూల, ప్రతికూల అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి సంబంధించి 19.94 ఎకరాల భూమి ఉందని, అందులో 5.10 ఎ కరాల భూమి ఆక్రమణలకు గురైందని చెప్పారు. ప్రభుత్వభూముల అన్యాక్రాంతం, ఆక్రమణలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత రెవె న్యూ అధికారులదేనన్నారు. తీరంవెంట ఉ న్న వారికి సునామీ కాలనీలో స్థలాలు, ఇ ళ్లు కేటాయించినప్పటికీ వారు వేటకు అ నుకూలంగా ఉంటుందని ఇక్కడే ఉంటున్నారని తహసీల్దార్‌ కలెక్టర్‌కు వివరించా రు. ఫిషింగ్‌హార్బర్‌ నిర్మాణానికి ప్రతిబంధకంగా ఉన్న ఆక్రమిత స్థ్ధలాలకు సంబంధించి గతంలో ప్రభుత్వానికి నివేదిక అం దజేశామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న భూమి స్థితిగతులపై ల్యాండ్‌ మేనేజ్‌మెం ట్‌ కమిటీకి నివేదిస్తామని, ఆ కమిటీ నిర్ణ యం మేరకు దీనిపై తదుపరి చర్యలు ఉంటాయని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు.


Updated Date - 2021-07-29T05:43:23+05:30 IST