Abn logo
Sep 26 2021 @ 00:42AM

వేతన సవరణ బకాయిలు చెల్లించాలి

-ఏపీ పీటీడీ ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి

ధర్మవరం, సెప్టెంబరు 25: శాసనసభలో ఆమోదించిన మేరకు 2017వ సంవత్సరం వేతన సవరణ బకాయిలు, నాలుగేళ్ల లీవ్‌ ఎన్‌ క్యాష్‌మెం ట్‌ బకాయిలు కూడా యాజమాన్యం చెల్లించాలని ఏపీపీటీడీ నేషనల్‌ మజ్దూర్‌యూనియన్‌ రాష్ట్రఅధ్యక్షుడు పీవీ రమణారెడ్డి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఎన్జీఓహోం కార్యాలయంలో శనివారం ఏపీపీటీడీ నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ కమిటీని ఏకగీవ్రంగా ఎంపికచేశారు. ఈ సందర్భంగా ముత్యాలప్ప అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఏపీపీటీడీ ఎన్‌ఎంయూ రాష్ట్రఅధ్యక్షుడు, రాష్ట్రకార్యదర్శి లక్ష్మీనారాయణ, రాష్ట్ర సంయుక్తకార్యదర్శి భాస్కర్‌నాయుడు తదితరులు హాజ రయ్యారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ...ప్రభుత్వ ఉద్యోగులు అయిన సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వంపరంగా రావాల్సిన అనేక సౌకర్యాలను ఆర్టీసీ యాజమాన్యం అనుమతులు తెప్పించుకొని అమలు చే యాల్సి ఉన్నప్పటికీ కొన్నింటిని మాత్రమే అమలుచేస్తున్నారన్నారు. ప్రధానం గా ఆర్టీసీ ఉద్యోగులకు ఓల్డ్‌పెన్సన్‌ మీద ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం ఇంకా తీసుకోకపోయినప్పటికి ఆర్టీసీలో ఉన్న ఎస్‌ఆర్‌బీఎస్‌ రద్దుచేయడం, గ్రాట్యూ టీని తగ్గించడం తదితర వాటిపై తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు.  ఈ సం దర్భంగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ నుండి 23 మంది ఎన్‌ఎంయూలోకి చేరారు.  కార్యక్రమంలో జోనల్‌ కార్యదర్శి చెన్నారెడ్డి, రీజనల్‌ కార్యదర్శి షబ్బీర్‌ తదితరులు పాల్గొన్నారు.

 నూతన కమిటీ ఎన్నిక: నేషనల్‌మజ్దూర్‌ యూనియన్‌ ధర్మవరం డిపో కమిటీని రాష్ట్రఅధ్యక్షుడు రమణారెడ్డి, కార్యదర్శి లక్ష్మీనారాయణల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిపో గౌరవాధ్యక్షుడు డోలారాజారెడ్డి, అధ్యక్షుడిగా కే ప్రభాకర్‌, కార్యదర్శిగా బీ నాగశేఖర్‌, చైర్మన్‌గా హనుమాన్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేఎస్‌ రాయుడులతో పాటు సభ్యులను ఎంపికచేశారు. అనంతరం డిపో గౌరవాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికైన డోలారాజారెడ్డిని ఆర్టీసీ ఉద్యో గులు పూలమాలలు, శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.