కోతలు లేకుండా వేతనం చెల్లించాలి

ABN , First Publish Date - 2020-04-05T09:48:44+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి కోతలు లేకుండా వేతనాలు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం

కోతలు లేకుండా వేతనం చెల్లించాలి

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామకృష్ణ


వికారాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి కోతలు లేకుండా వేతనాలు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామకృష్ణ డిమాండ్‌ చేశారు. కరోనాను కట్టడి చేయడంలో ఎవరి వంతు వారు నిర్వర్తిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందజేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ మినహా ఇతర శాఖల ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోత విధించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మనది ధనిక రాష్ట్రమని చెప్పే సీఎం కేసీఆర్‌ ఈ కష్ట సమయంలో ఉద్యోగులకు మొత్తం వేతనంతో పాటు కొంత అదనంగా చెల్లించి వారికి అండగా నిలవాల్సిందిపోయి వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేలా కోతలు విధించడం సమంజసం కాదన్నారు.


కరోనాను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులందరికీ ఆర్థిక సహాయంతో పాటు బీమా సదుపాయం కల్పించి ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చేతికివస్తున్న ఉల్లి, పసుపు పంటలను గ్రామాల్లోనే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని, లేనిపక్షంలో మార్కెట్‌కు తీసుకువెళ్లే సౌలభ్యం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-04-05T09:48:44+05:30 IST