ఫోన్లో ఆగని నోటిఫికేషన్లు.. మునుపెన్నడూ చూడని కనకవర్షం.. నమ్మలేకపోతున్నానంటూ మురిసిపోయిన మహిళ..!

ABN , First Publish Date - 2021-12-13T02:23:30+05:30 IST

లోకంలో మంచితనం, జాలీ, దయ మిగిలున్నాయనే నిరూపించే ఘటన ఇది..! జాస్మిన్ కాస్టెల్లో.. అమెరికాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో వెయిట్రస్‌గా పనిచేస్తుంటుంది. అది చాలా బిజీగా ఉండే రెస్టారెంట్! నిత్యం కస్టమర్లతో కిటకిట లాడుతూనే ఉంటుంది. ఇటీవల ఓ రోజున..

ఫోన్లో ఆగని నోటిఫికేషన్లు.. మునుపెన్నడూ చూడని కనకవర్షం.. నమ్మలేకపోతున్నానంటూ మురిసిపోయిన మహిళ..!

ఇంటర్నెట్ డెస్క్: లోకంలో మంచితనం, జాలీ, దయ మిగిలున్నాయని నిరూపించే ఘటన ఇది..! జాస్మిన్ కాస్టెల్లో..  అమెరికాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో వెయిట్రస్‌గా పనిచేస్తుంటుంది. అది చాలా బిజీగా ఉండే రెస్టారెంట్! నిత్యం కస్టమర్లతో కిటకిట లాడుతూనే ఉంటుంది. ఇటీవల ఓ రోజు రద్దీ మరింత ఎక్కువైంది. ఆ టైమ్‌లో రిటా విలియమ్స్ అనే మహిళ తన తల్లితో వచ్చింది. అయితే..జాస్మిన్ అంత బిజీ వాతావరణంలోనూ ఏమాత్రం విసుగు చూపించకుండా.. రీటా కోరినవన్నీ చిరునవ్వుతో తెచ్చి ఇచ్చింది.  ముఖంపై చిరునవ్వు చెదరకుండా.. అంత బిజీ వాతావరణంలోనూ తన విధులు నిర్వర్తించింది. సాధారణంగా అటువంటి సమయాల్లో వెయిట్రస్‌లు కొంత ఒత్తిడికి లోనవుతుంటారు. ఇటువంటి సందర్భాల్లో రెస్టారెంట్ సిబ్బంది కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు కూడా కోకొల్లలు. 


కానీ.. జాస్మిన్ మాత్రం పక్కా ప్రొఫెషనల్‌గా వ్యవహరించింది. దీంతో.. అబ్బురపడిన రిటా.. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టింది. అంతేకాకుండా.. జాస్మిన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. అక్కడ వచ్చే జీతంరాళ్లు.. తన ఖర్చులకు అసలేమాత్రం చాలటం లేదని, దీంతో.. రాజీనామా చేద్దామనుకున్నప్పటికీ ఎందుకో ఆ మరుసటి రోజు వచ్చానని జాస్మిన్ రీటాతో చెప్పింది. ఈ విషయాన్ని కూడా రీటా తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంది. దీంతో.. జాస్మిన్ పరిస్థితి నెటిజన్లకు అర్థమై ఆమెకు పెద్ద ఎత్తున డబ్బులు పంపించారు. ఆ మొబైల్ వ్యాలెట్ ఐడీని కూడా రీటా ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో ఇదంతా సాధ్యమైంది. రీటా పోస్టు తరువాత.. తన మొబైల్‌లో నోటిఫికేషన్లు రాకడ ఆగలేదని, ఇప్పటివరకూ ఏకంగా 7లక్షల రూపాయలు వచ్చాయని(మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..), ఇంకా వస్తున్నాయని సంబరపడిపోతూ చెప్పింది జాస్మిన్. ప్రస్తుతం ఈ ఉదంతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Updated Date - 2021-12-13T02:23:30+05:30 IST