వైసీపీకి ఓటు వేయలేదని.. ఇంటి ముందు కట్టిన గోడ తొలగింపు

ABN , First Publish Date - 2021-04-21T10:20:13+05:30 IST

వైసీపీకి ఓటేయలేదని ఇంటిముందు అడ్డంగా గోడ కట్టేసిన ఘటనపై ఎట్టకేలకు అధికారులు స్పందించారు. మంగళవారం జేసీబీతో గోడను తొలగించారు. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో గత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుకు ఓటు వేయలేదనే కారణంతో

వైసీపీకి ఓటు వేయలేదని.. ఇంటి ముందు కట్టిన గోడ తొలగింపు

వీరులపాడు, ఏప్రిల్‌ 20: వైసీపీకి ఓటేయలేదని ఇంటిముందు అడ్డంగా గోడ కట్టేసిన ఘటనపై ఎట్టకేలకు అధికారులు స్పందించారు. మంగళవారం జేసీబీతో గోడను తొలగించారు. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో గత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుకు ఓటు వేయలేదనే కారణంతో టీడీపీ సానుభూతిపరుడు నర్రేడ్ల కాళేశ్వరరావు ఇంటికి అడ్డంగా వైసీపీ నేతలు గోడ నిర్మించారు.


ఈ విషయాన్ని ఈనెల 18న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించడంతో పంచాయతీ, రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించారు. మంగళవారం పంచాయతీ కార్యదర్శి గొర్రెపాటి శ్యామ్‌కుమార్‌ జేసీబీతో ఆ గోడను తొలగించారు. గోడను తిరిగి నిర్మించేందుకు పూనుకుంటే క్రిమినల్‌ చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, ఆ రోడ్డుపై పోసిన డస్ట్‌, మట్టిని మాత్రం తొలగించకపోవటంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాటిని కూడా తొలగించేలా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2021-04-21T10:20:13+05:30 IST