‘మావోయిస్ట్‌’ల పేరుతో గోడపత్రికలు... నకిలీవంటున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-10-19T23:00:01+05:30 IST

భూపాలపల్లి మండలం పంబాపూర్‌లో మావోయిస్టుల పేరుతో వెలసిన గోడపత్రిక ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఇది కలకలం సృష్టించింది. సీపీఐ(మావోయిస్ట్) కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ ఏరియా కమిటీ పేరుతో వెలసిన ఈ గోడ పత్రికలో... గ్రామ సర్పంచి భర్త రమేష్‌, మరో ఇద్దరు వ్యక్తులు గ్రామస్థులను ఇబ్బందులు పెట్టి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రజాకోర్టులో వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.

‘మావోయిస్ట్‌’ల పేరుతో గోడపత్రికలు... నకిలీవంటున్న పోలీసులు

భూపాలపల్లి : భూపాలపల్లి మండలం పంబాపూర్‌లో మావోయిస్టుల పేరుతో వెలసిన గోడపత్రిక ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఇది కలకలం సృష్టించింది. సీపీఐ(మావోయిస్ట్) కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ ఏరియా కమిటీ పేరుతో వెలసిన ఈ గోడ పత్రికలో... గ్రామ సర్పంచి భర్త రమేష్‌, మరో ఇద్దరు వ్యక్తులు గ్రామస్థులను ఇబ్బందులు పెట్టి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రజాకోర్టులో  వారికి  శిక్ష తప్పదని హెచ్చరించారు.


ఎనిమిదేళ్ల క్రితం... మహాముత్తారం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన వేంకటేశ్వరరావుకు పట్టిన గతే వీరికీ పడుతుందని హెచ్చరించారు. ఇక... ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధుల ఆస్తుల వివరాలతో మరో కరపత్రాన్ని కూడా ప్రచురించారు. అందులో రేవూరి ప్రకాష్ రెడ్డి, నల్ల మనోహర్‌ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహా మరికొందరు నేతల భూముల వివరాలను పేర్కొన్నారు. అయితే... ఈ గోడపత్రిక నకిలీదని, కొన్నేళ్ల క్రితం ముద్రించినదని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2020-10-19T23:00:01+05:30 IST