సంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-01-16T06:04:35+05:30 IST

సంక్రాంతి పండుగను జిల్లా ప్రజలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. మహిళలు తమ ఇళ్ల ముందు వివిధ రకాల రంగవల్లులను అందంగా తీర్చిదిద్దారు.

సంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలు
నల్లగొండ జిల్లాకేంద్రంలో ముగ్గు వేస్తున్న యువతులు

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌,  జనవరి 15 : సంక్రాంతి పండుగను జిల్లా ప్రజలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. మహిళలు తమ ఇళ్ల ముందు వివిధ రకాల రంగవల్లులను అందంగా తీర్చిదిద్దారు. కనగల్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలు సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. దర్వేశిపురం ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నిడమనూరు మండల ప్రజలు సంక్రాం తి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. శాలిగౌరారం మండలంలో జువారి జైకిసాన్‌ జంక్షన్‌ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. మర్రిగూడ మండలంలో సహస్త్ర వేదిక సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సేవా దృక్పథం అభినందనీయమని మర్రిగూడ సర్పంచ్‌ నల్లా యాదయ్యగౌడ్‌ అన్నారు. మర్రిగూడ మండలంలోని కుదాభక్షుపల్లి గ్రామంలో పీఎ్‌సఆర్‌ యువసేన, శివన్నగూడ సామాజిక కార్యకర్త ఆధ్వర్యంలో  ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంస్కృతీ, సాంప్రదాయాలకు ముగ్గుల పోటీలు ఉపయోగపడుతాయని జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి అన్నారు. కట్టంగూరు మండలంలోని పందెనపల్లి గ్రామంలో మన గ్రోమోర్‌ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కేతేపల్లి, దేవరకొండ, చింతపల్లి, నార్కట్‌పల్లి మండలంలోని వివిధ గ్రామా ల్లో సంక్రాంతి వేడుకలు ఘంగా జరుపుకున్నారు. సంక్షోభాల నుంచి చేనేత రంగాన్ని కాపాడి చేనేతలను ఆదుకోవాలని కోరుతూ నార్కట్‌పల్లి మండలంలోని నెమ్మానికి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు చిటిపోలు శేఖర్‌ భార్య ప్రమీల, కూతురు మానస వాకిలిలో చేనేత చీర రూపంలో వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. 

Updated Date - 2021-01-16T06:04:35+05:30 IST