జాబ్ నుంచి తొలగించారనే కోపంతో.. వాల్‌మార్ట్ మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-04-08T18:58:45+05:30 IST

వాల్‌మార్ట్ మాజీ ఉద్యోగి నిర్వాకమిదీ. తనను ఉద్యోగం నుంచి తొలగించారనే కోపంతో ఏకంగా తన కారుతో షాపింగ్ మాల్‌లోకి దూసుకెళ్లాడు.

జాబ్ నుంచి తొలగించారనే కోపంతో.. వాల్‌మార్ట్ మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే..

నార్త్ కరోలినా: వాల్‌మార్ట్ మాజీ ఉద్యోగి నిర్వాకమిదీ. తనను ఉద్యోగం నుంచి తొలగించారనే కోపంతో ఏకంగా తన కారుతో షాపింగ్ మాల్‌లోకి దూసుకెళ్లాడు. అమెరికాలోని నార్త్ కరోలినా థండర్ రోడ్‌లోని వాల్‌మార్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. లాసీ కార్డెల్ జెంట్రీ(32) అనే వ్యక్తి ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. వాల్‌మార్ట్‌లోకి కారుతో దూసుకెళ్లిన లాసీ కార్డెల్.. మార్ట్‌లోని వినియోగదారులను భయబ్రాంతులకు గురి చేశాడు. ఈ ఘటనలో మాల్ ఎంట్రన్స్‌తో పాటు లోపల కొంత భాగం స్వల్పంగా దెబ్బతింది. దాంతో వెంటనే మాల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో మార్ట్‌కు చేరుకున్న పోలీసులు లాసీ కార్డెల్‌ను అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో కొద్దిసేపు షాపింగ్ మాల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   

Updated Date - 2021-04-08T18:58:45+05:30 IST