సున్నిపెంటలో ఎలుగుబంట్ల సంచారం

ABN , First Publish Date - 2022-01-26T04:34:50+05:30 IST

సున్ని పెంట గ్రామంలో ఎలుగుబంట్ల సంచారం ఎక్కువైంది. అటవీ ప్రాంతం నుంచి రాత్రి వేళల్లో ఎలుగుబంట్లు గ్రామంలోకి వస్తు న్నాయి.

సున్నిపెంటలో ఎలుగుబంట్ల సంచారం


శ్రీశైలం, జనవరి 25: సున్ని పెంట గ్రామంలో ఎలుగుబంట్ల సంచారం  ఎక్కువైంది. అటవీ ప్రాంతం నుంచి రాత్రి వేళల్లో ఎలుగుబంట్లు గ్రామంలోకి వస్తు న్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు గత వారంలో బోన్లను ఏర్పాటు చేసి రెండు ఎలుగుబంట్లను పట్టుకొన్నారు. వెస్ట్రన కాలనీ ఫిల్టర్‌హౌస్‌ సమీపంలో మరో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. విషయాన్ని స్థానికులు అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే గ్రామశివార్లలో బోన్లను ఏర్పాటు చేస్తామని శ్రీశైలం రేంజర్‌ తెలిపారు. అటవీ సిబ్బందితో రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నామని, డప్పు, టపాసుల శబ్దాలతో ఎలుగుబంట్లను గ్రామంలోకి ప్రవేశించకుండా దారి మళ్లిస్తున్నామని తెలిపారు. అటవీ సమీ గ్రామాలవారు రాత్రివేళల్లో బయటకు రావొద్దని సూచించారు.


Updated Date - 2022-01-26T04:34:50+05:30 IST