అన్నీ మూసేయమంటారా... చెప్పండి... : సీఎం ఉద్ధవ్ తీవ్ర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-03-14T02:40:00+05:30 IST

ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రజల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నా

అన్నీ మూసేయమంటారా... చెప్పండి... : సీఎం ఉద్ధవ్ తీవ్ర వ్యాఖ్యలు

ముంబై : ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రజల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నా, ఏమాత్రం బాధ్యతతో మెలగడం లేదని ఆవేదనతో కూడిన హెచ్చరికను జారీ చేశారు. ‘‘హోటళ్లను, షాపింగ్ మాల్స్‌ను పూర్తిగా మూసేయమంటారా? చెప్పండి. ఆ దిశగా మేము నిర్ణయాలు తీసుకునేలా వ్యవహరించకండి. కానీ ఆ దిశగా ప్రస్తుతానికి వెళ్లాలని భావించడం లేదు.’’ అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. కోవిడ్ నిబంధనలను పాటించాలని, లేదంటే షాపింగ్ మాల్స్, హోటళ్లను మూసేయాల్సిన పరిస్థితి వస్తుందన్న అర్థం వచ్చేలా హెచ్చరించారు. కరోనా పెరిగిపోతున్న నేపథ్యంలో శనివారం సీఎం ఉద్ధవ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, మాస్క్‌లను విధిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కొన్ని రోజుల క్రితం కూడా సీఎం ఉద్ధవ్ ఇదే తరహా కఠినమైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇదే రకమైన హెచ్చరికలను చేసింది. కోవిడ్ గ్రాఫ్ ఎలా వెళ్లాలన్నది ప్రజల చేతిలోనే ఉందని స్పష్టం చేసింది. ‘‘కరోనా గ్రాఫ్ ఎలా వెళ్లాలన్నది ప్రజల చేతిలోనే ఉంది. ముంబై బాగుండాలంటే కరోనా రాకుండా చూసుకోవాలి. అది ప్రజల సహకారం లేకుండా సాధించలేం.’’ అని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. 

Read more