యుద్ధం

ABN , First Publish Date - 2020-08-04T06:41:06+05:30 IST

నిమిషానికో ఖండిత శిరస్సు నేల రాలుతున్నది కనిపించని శత్రువు ఖండాలుగా చీల్చి చెండాడుతున్నది...

యుద్ధం

నిమిషానికో ఖండిత శిరస్సు

నేల రాలుతున్నది

కనిపించని శత్రువు

ఖండాలుగా చీల్చి చెండాడుతున్నది

పొరుగుదేశం నుంచి చొరబడి

మాయా యుద్ధం చేస్తున్నది

ఇక్కడ బుల్లెట్లు కనిపించవు

బాంబుల శబ్దాలూ వినిపించవు

సైలెంట్ కిల్లర్ మాత్రం

మూడో ప్రపంచ యుద్ధం చేస్తున్నది

దేశం తగులబడిపోతుంటే

ఇక్కడ పాలకులు మాత్రం

ఫిడేలు వాయించుకుంటున్నారు

భక్తిశ్రద్ధలతో ఆలయాలు నిర్మించుకుంటున్నారు

ప్రజలను కాపాడేందుకు

భజనలకు సిద్ధమవుతున్నారు

పీఎస్ రవీంద్ర

Updated Date - 2020-08-04T06:41:06+05:30 IST