ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది మధ్య వార్‌!

ABN , First Publish Date - 2021-12-01T05:20:28+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది మధ్య వార్‌!

ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది మధ్య వార్‌!
పరిగిలోని ప్రభుత్వ ఆస్పత్రి

  • ఎమ్మెల్యే, డీఎంహెచ్‌వోలకు ఫిర్యాదులు
  • రోగులకు చికిత్సలు, ఆస్పత్రి నిర్వహణ గాలికి!

పరిగి: పరిగి ప్రభుత్వ అస్పత్రిలో వైద్య సేవలు గాలికోదిలేశారు. సూపరిండెంట్‌, డాక్టర్లు, సిబ్బంది మధ్య పొడచూసిన భేదాభిప్రాయాలు బూతులు తి ట్టుకొని తోసుకునే స్థాయికి చేరాయి. అస్పత్రిలో ముగ్గురు డాక్టర్లు, 15మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా షిఫ్ట్‌ల వారీ డ్యూటీ చేస్తుంటారు. అస్పత్రి సూపరిండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్లు ఒక వైపు.. మిగతావారంతా ఒక వైపు అన్నట్టు గ్రూపుగా విడిపోయా రు. రెండు గ్రూపులూ ఒకరిపై ఒకరు ఎమ్మెల్యే, డీఎంహెచ్‌వోల ఫిర్యాదు చేసుకున్నారు. సూపరింటెండెంట్‌, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు కలిసి సిబ్బందిని హేలన చేయడం, ఉద్దేశపూర్వకంగా విధి నిర్వహణల్లో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. స్టాఫ్‌నర్స్‌ సునంద, ఇతర సిబ్బంది వారిపై ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కొందరు ఆస్పత్రిలో మద్యం తాగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వేతన బిల్లులకూ తమ వద్ద లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నెల 28న సాయంత్రం ఓ కిందిస్థాయి ఉద్యోగి మద్యం తాగి ఓ డాక్టర్‌, ఓ నర్సును బూతులు తిట్టిన సంఘటన జరిగింది. ‘మేం చెప్పింది వినాలె. లేకుంటే ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తాం.’ అని బెదిరించాడని ఆస్పత్రి సిబ్బంది వాపోయారు. ఆస్పత్రిలో మద్యం తాగడ, ఇతర అసాంఘిక కార్యకలాపాలకూ కొందరు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులతో రోగులకు పేవలందడం లేదు. కొందరు డ్యూటీలకు రావడం లేదు. 29న మధ్యాహ్నం అత్యవసర చికిత్సకు వచ్చిన ఓ వృద్ధుడు మృతిచెందాడు. వైద్యం అందకనే మృతిచెందాడని బంధువులు ఆందోళన చేశారు. నిజానికి ఆ వృద్ధుడు ఆస్పత్రికి వచ్చిన అర్ధగంట వరకూ వైద్యం అందలేదు. ఛాతీ నొప్పితో అతడు మృతిచెందాడు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిఽధులు కల్పించుకొని పరిగి ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది మధ్య కోల్డ్‌వార్‌కు ఎండ్‌ కార్డ్‌ వేయాలని కోరుతున్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-12-01T05:20:28+05:30 IST