Abn logo
Dec 4 2020 @ 12:37PM

గాయకుడిపై కంగన తీవ్ర విమర్శలు!

బాలీవుడ్ గాయకుడు దిల్జిత్ దోసంజ్‌పై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దిల్జీత్‌ను కరణ్ జోహార్ కుక్కగా అభివర్ణించింది. ఢిల్లీలో రైతుల ఆందోళనలను ఉద్దేశిస్తూ కంగన చేసిన ట్వీట్ ఇటీవల వివాదాస్పదంగా మారింది. రైతుల ఆందోళనలో పాల్గొన్న ఓ సిక్కు వృద్ధురాలిని షాహీన్ బాగ్ బామ్మగా భావించి కంగన తప్పుడు ట్వీట్ చేసింది. 


`షాహిన్ బాగ్ బామ్మ రూ.100 ఇస్తే చాలు ఇలాంటి ఆందోళనలకు వచ్చేస్తార`ని కంగన ట్వీట్ చేసింది. కొద్దిసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసేసింది. ఈ ట్వీట్‌పై పలువురు సెలబ్రిటీలు విమర్శలు చేశారు. ఈ ట్వీట్‌పై పంజాబీ సింగర్ దిల్జిత్ స్పందిస్తూ.. `కంగన టీమ్‌ వాస్తవం తెలుసుకోండి. ఎవరూ ఇంత గుడ్డివాళ్లలా ఉండకూడదు. షాహిన్ బాగ్ బామ్మగా కంగన భావించిన ఈమె పేరు మహిందీర్ కౌర్. ఆమె(కంగన) చెప్పేదాన్ని గుడ్డిగా ఫాలో అవకండ`ని దిల్జిత్ ట్వీట్ చేశాడు. అలాగే మహిందీర్ కౌర్ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశాడు. దీనిపై కంగన స్పందిస్తూ.. `నువ్వు కరణ్ జోహార్ పెంపుడు కుక్కవి. పౌరచట్టం కోసం అప్పుడు ఆందోళనలు చేసిన ఆ బామ్మే 100 రూపాయల కోసం ఇప్పుడు రైతులకు మద్దతుగా వచ్చిందని మాత్రమే నేను చెప్పాను. ఈ డ్రామా అంతా ఏంట`ని కంగన జవాబిచ్చింది.


దీనికి దిల్జిత్ స్పందిస్తూ.. `నువ్వు ఎవరితో కలిసి పని చేశావో నువ్వు వాళ్లందరికీ పెంపుడు జంతువువేనా? అలా అయితే ఆ జాబితా చాలా పెద్దగా ఉంటుంది. ఇది బాలీవుడ్ కాదు.. పంజాబ్. మనుషుల భావోద్వేగాలతో ఎలా ఆడుకోవాలో నీకు తెలుస`ని రిప్లై ఇచ్చాడు. ఆ ట్వీట్‌పై కంగన స్పందిస్తూ.. `పని కోసం నువ్వు ఎవరి కాళ్లు పట్టుకుంటున్నావో.. వాళ్లకి నేను రోజూ జ్ఞానం అందిస్తున్నా. నేను నీలాగ అందరి కాళ్లూ పట్టుకునే రకాన్ని కాదు. ఎందుకంటే నేను కంగనా రనౌత్` అని సమాధానమిచ్చింది. 

Advertisement
Advertisement
Advertisement