13 రోజుల్లోనే పాకిస్తాన్ తల వంచింది: 1971 యుద్ధంపై రాహుల్

ABN , First Publish Date - 2021-12-16T21:04:01+05:30 IST

వాస్తవానికి ఏ యుద్ధమైన 6 నెలల నుంచి ఏడాది, రెండేళ్ల పాటు కొనసాగుతుంది. కానీ 1971 నాటి యుద్ధంలో కేవలం 13 రోజులకే పాకిస్తాన్ దిగి వచ్చింది. భారత సేనల ముందు పాక్ సేనలు తల వంచారు. ప్రపంచ అగ్రగామి అని చెప్పుకునే అమెరికా 20 ఏళ్ల పాటు అఫ్ఘానిస్తాన్‌తో యుద్ధం చేసింది..

13 రోజుల్లోనే పాకిస్తాన్ తల వంచింది: 1971 యుద్ధంపై రాహుల్

న్యూఢిల్లీ: భారత క్రౌర్యానికి పాకిస్తాన్ 13 రోజులకే తల వంచాల్సి వచ్చిందని 1971 నాటి యుద్ధాన్ని గుర్తు చేసుకుంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గురువారం డెహ్రడూన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ విభజనకు ముందు ఇండియా-పాక్ మధ్య జరిగిన యుద్ధంపై తన అభిప్రయాల్ని వ్యక్తం చేశారు.


‘‘వాస్తవానికి ఏ యుద్ధమైన 6 నెలల నుంచి ఏడాది, రెండేళ్ల పాటు కొనసాగుతుంది. కానీ 1971 నాటి యుద్ధంలో కేవలం 13 రోజులకే పాకిస్తాన్ దిగి వచ్చింది. భారత సేనల ముందు పాక్ సేనలు తల వంచారు. ప్రపంచ అగ్రగామి అని చెప్పుకునే అమెరికా 20 ఏళ్ల పాటు అఫ్ఘానిస్తాన్‌తో యుద్ధం చేసింది. కానీ ఇండియా కేవలం 13 రోజుల్లోనే యుద్ధం ముగించి విజయం సాధించింది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.


కాగా, బంగ్లా విముక్తి దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ మాజీ ప్రధాని ఇందిగా గాంధీని గుర్తు చేసుకున్నారు. ఈ విషయమై బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘‘ఇందిరా గాంధీ ఆమె గొప్పతనాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమె ధైర్యసాహసాలు కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలిచాయి. అనేక విధాలుగా 1971 ఏడాది ఇందిరాకు ఎంతో ప్రత్యేకం. ఆమె బంగ్లా ప్రజల కోసం మొత్తం ప్రపంచ సమాజాన్ని చైతన్యపరిచారు’’ అని అన్నారు.

Updated Date - 2021-12-16T21:04:01+05:30 IST