Abn logo
Jul 22 2021 @ 07:44AM

Rain: వరంగల్‌లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వాన

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలోని  వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లల్లో వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.