Abn logo
Sep 1 2021 @ 07:12AM

వరంగల్‎లో ముగ్గురి దారుణ హత్య

వరంగల్‌: వరంగల్‎లోని మట్టెవాడలో తెల్లవారుజామున దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. దుండుగుల దాడిలో ముగ్గురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు సమర్‌, ఫహద్‌ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతులు చాంద్‌పాషా (50), ఖలీల్‌ (40), సబీరా(42)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు ఆర్థిక లావాదేవీలే హత్యలకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.