Abn logo
Sep 7 2021 @ 07:07AM

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. వర్షపు కాలనీలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరొవైపు హన్మకొండ బస్టాండ్, తహసీల్దార్ కార్యాలయం భారీ వర్షానికి నీటమునిగింది. రహదారుల పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల జల్లులుగా.. మరికొన్ని చోట్ల భారీగా కురిసింది. వాన జోరుకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి.